దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే: రఘునందన్​రావు

దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్​రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం దౌల్తాబాద్​ మండలం కోనాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్​ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. 

ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, తాను చేపట్టిన ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే బీజేపీతోనే సాధ్యమని, అటు దేశంలో ఇటు రాష్ట్రంలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావడం ఖాయమని పేర్కొన్నారు. అనంతరం పలువురు బాధితులను పరామర్శించాడు.