ప్రశ్నించే గొంతును లేకుండా చేస్తున్నారు

ప్రశ్నించే గొంతును లేకుండా చేస్తున్నారు

నకిరేకల్: రాష్ట్రంలో ఇద్దరు న్యాయవాదులను నడిరోడ్డు మీద నరికి చంపిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. చనిపోయిన ఇద్దరు న్యాయవాదులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల భూ కబ్జాలకు వ్యతిరేకంగా దేవుని మాన్యాల కబ్జాలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశారని, ఆ పాపానికి వారిని దేవుని దగ్గరకే పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై  ప్రశ్నించిన వారి గొంతు లేకుండా చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పోయి రాచరిక పాలన వచ్చింది అనుకున్నాం కానీ, అది కూడా పోయి రాక్షస పాలన వచ్చిందన్నారు.

గురువారం నకిరేకల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక పచ్చీసు ప్రభారి సభలో రఘునందన్ పాల్గొన్నారు. సభలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం  ప్రభుత్వ టీచర్లని ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి లేకుండా దిగజారిందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి  ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. 2018 ఎన్నికలలో తనను ఓట్లు వేసి గెలిపిస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని కేసిఆర్ నిరుద్యోగులను వంచించాడన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ మిత్రులు, నిరుద్యోగుల అంతా కలసి టిఆర్ఎస్ ను ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు