బిల్కిస్ బానో తీర్పు పై వారిది ఒకే మాట : రఘునందన్ రావు

బిల్కిస్ బానో తీర్పు పై  వారిది ఒకే మాట : రఘునందన్ రావు
  • దళిత మహిళకు అన్యాయంపై మాట్లాడరా
  • బీజేపీ లీడర్ రఘునందన్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి  ఉన్న రెండు ముఖాలు అని, ఆ రెండు వేర్వేరు కావని బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు.పార్టీ స్టేట్​ ఆఫీసులో ఆయన మీడియాతో  మాట్లాడారు. బిల్కిస్ బానో తీర్పు పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకే మాట మాట్లాడుతున్నారని ఆరోపిం చారు. బిల్కిస్ బానో తీర్పు పై మాట్లాడుతున్న వారు  అయోధ్య రామమందిర నిర్మాణం పై సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు.

 మీరు రావణాసురుడు, లేదా శూర్పనకు వారసులా, లేక ఎవరికి అని నిలదీశారు. రామమందిర ట్రస్ట్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వస్తామో రామో చెప్పడానికి నోరు పెగలడం లేదని ఎద్దేవా చేశారు. డైవర్స్ కేసులో  సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ ముస్లిం మహిళలకు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చట్టం తెచ్చిందని గుర్తు చేశారు.  మైనారిటీల ఓట్ల కోసమే బిల్కిస్ బానో తీర్పు ను స్వాగతిస్తున్నారని మండిపడ్డారు.

నవాపి సర్వే పై కోర్టు తీర్పు ను ఎందుకు స్వాగతించరని ప్రశ్నించారు. రామసేతును కూల్చి వేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలిపినా ఎందుకు మాట్లాడలేదన్నారు. అదిలాబాద్ జిల్లాలో టేకులపల్లి లక్ష్మి హత్యపై మీరందరూ  గురించి ఎందుకు మాట్లాడ లేదని నిలదీశారు. దళిత మహిళపై జరిగిన అన్యాయం పై  కవిత , కేటీఆర్  ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

నేక ఇష్యూలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకే రకమైన ప్రకటనలు చేస్తున్నాయని ఆరోపించారు.రాహుల్ గాంధీ చెబితే తాను  ఆస్పత్రి కి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించా నని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని, వారు వేర్వేరు కాదని ఆయన  అన్నారు.