అక్రమాలను అరికడితేనే ఆదాయం! : రెవెన్యూ కార్యదర్శి రఘునందన్‌ రావు

అక్రమాలను అరికడితేనే ఆదాయం! :  రెవెన్యూ కార్యదర్శి రఘునందన్‌ రావు
  • ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు 

హైదరాబాద్, వెలుగు: ఎన్‌డీపీఎల్, ఎన్‌డీపీఎస్, నాటుసారా వంటి అక్రమ కార్యకలాపాలను అడికట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని రెవెన్యూ కార్యదర్శి రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. గురువారం ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై ప్రత్యేకంగా చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైమ్ కంట్రోల్ రిజల్ట్స్ ఓరియంటెడ్‌గా ఉండాలన్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు పనితీరు మెరుగుపడితే ఫలితాలు బాగుంటాయని సూచించారు. క్రైమ్ కంట్రోల్ పై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఉ సమావేశంలో  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేశ్ రాథోడ్, జాయింట్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.