రాహుల్​ ద్రవిడ్‌‌కు అండగా సీఓఏ

రాహుల్​ ద్రవిడ్‌‌కు అండగా సీఓఏ

ముంబై: కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్‌‌ ఇంట్రస్ట్‌‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ గురువారం బీసీసీఐ ఎథిక్స్‌‌ ఆఫీసర్‌‌ డీకే జైన్‌‌ ముందు హాజరయ్యాడు. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలకు ద్రవిడ్‌‌ వివరణ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో రాహుల్‌‌కు.. కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌(సీఓఏ) అండగా నిలిచింది. నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ డైరెక్టర్‌‌గా నియమితుడైన రాహుల్‌‌ ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ  చెన్నై  ఓనర్​ అయిన ఇండియా సిమెంట్స్‌‌లో వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్నాడని మధ్యప్రదేశ్‌‌ అసోసియేషన్‌‌ సభ్యుడు సంజీవ్‌‌ గుప్తా ఫిర్యాదు చేశాడు అయితే రాహుల్‌‌ది అసలు కాన్‌‌ఫ్లిక్ట్​ ఆఫ్​ ఇంట్రస్ట్‌‌ కిందకు రాదని ఎథిక్స్‌‌ ఆఫీసర్‌‌కు రాసిన ఓ లేఖలో సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ పేర్కొన్నారు. ఇందుకు ఆర్‌‌బీఐ మాజీ గవర్నర్‌‌ రఘురామ్‌‌రాజన్‌‌, నీతీ ఆయోగ్‌‌ మాజీ వైస్‌‌ చైర్మన్‌‌ అరవింద్‌‌ పనగారియాలను ఉదాహరణగా చెప్పారు. ఆర్‌‌బీఐ పదవి కోసం రఘురామ్‌‌ చికాగో యూనివర్సిటీలో తన టీచర్‌‌ ఉద్యోగానికి సెలవు పెట్టారని ఎథిక్స్‌‌ ఆఫీసర్‌‌ దృష్టికి తీసుకొచ్చారు.