భారత చీఫ్ సెలెక్టర్గా రాహుల్ ద్రవిడ్?.. అక్టోబర్‌లో బాధ్యతలు తీసుకునే ఛాన్స్!

భారత చీఫ్ సెలెక్టర్గా రాహుల్ ద్రవిడ్?.. అక్టోబర్‌లో బాధ్యతలు తీసుకునే ఛాన్స్!

Team India Chief Selector Rahul Dravid: భారత క్రికెట్‌లో మరో సంచలన మార్పుకు రంగం సిద్ధమవుతోంది. భారత మాజీ హెడ్ కోచ్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ త్వరలోనే సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అజిత్ అగార్కర్ స్థానంలో, అక్టోబర్ 2026 నాటికి ద్రవిడ్ ఆ బాధ్యతలను చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కోచ్‌గా సక్సెస్.. ఇప్పుడు సెలెక్టర్గా కొత్త రోల్: 

టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడమే కాకుండా, వన్డే ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరింది. గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా, ఇండియా అండర్-19, ఇండియా 'ఎ' జట్ల కోచ్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ద్రవిడ్‌కు దేశవాళీ క్రీడాకారుల ప్రతిభపై పూర్తి అవగాహన ఉంది. క్రికెట్‌లో ద్రవిడ్‌కు ఉన్న చాలా అనుభవం ఉంది.. దీంతో ద్రవిడ్ సెలెక్షన్ కమిటీకి నేతృత్వం వహిస్తే జట్టు ఎంపికలు మరింత పారదర్శకంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉంటాయని బీసీసీఐ భావిస్తోంది. 

అక్టోబర్‌లో సెలెక్టర్గా ద్రవిడ్ బాధ్యతలు:  

ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీ కాలం అక్టోబర్‌తో ముగియనుండటంతో, తదుపరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ద్రవిడ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. రాబోయే ఐసీసీ మెగా టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయడంలో ద్రవిడ్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.  

ALSO READ : శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందే భారత్కి బిగ్ షాక్..