ఎన్‌సీఏ కొవిడ్–19 టాస్క్ ఫోర్స్‌లో రాహుల్ ద్రవిడ్?

ఎన్‌సీఏ కొవిడ్–19 టాస్క్ ఫోర్స్‌లో రాహుల్ ద్రవిడ్?

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతున్న దృష్ట్యా క్రికెటర్‌‌ల హెల్త్ గురించి బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కొవిడ్–19 టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీలో మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌ను చేర్చనుందని తెలిసింది. కరోనా నుంచి ప్లేయర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ దిశా నిర్దేశం చేయనుందని సమాచారం. ప్లేయర్లు తమ సెంటర్స్‌లో ట్రెయినింగ్‌ను రీస్టార్ట్‌ చేసే ముందు కన్సెంట్ ఫామ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

ఎన్‌సీఏలో ట్రెయినింగ్‌ రీస్టార్ట్‌ అవ్వడంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ద్రవిడ్, మెడికల్ ఆఫీసర్, హైజీన్ ఆఫీసర్, బీసీసీఐ ఏజీఎం, క్రికెట్ ఆపరేషన్స్ తదితరులు కీలకంగా వ్యవహరించనున్నారని సమాచారం. ఆటగాళ్లతో కమ్యూనికేట్ అవ్వడం, కరోనా రిస్క్ తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్లేయర్లకు వివరించడమే ఈ టాస్క్‌ఫోర్స్ పని అని తెలుస్తోంది. ట్రెయినింగ్ మొదలుపెట్టే ముందు అందరు ప్లేయర్లతోపాటు ఎన్‌సీఏ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు కరోనా టెస్టులు నిర్వహిస్తారని ఎస్‌ఓపీ ప్రకారం తెలిసింది.