ద్రవిడ్‌‌కు ‘కాన్‌‌ఫ్లిక్ట్‌‌’ అడ్డు

ద్రవిడ్‌‌కు ‘కాన్‌‌ఫ్లిక్ట్‌‌’ అడ్డు

న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌కు కాన్‌‌ఫ్లిక్‌‌ ఆఫ్‌‌ ఇంటరెస్ట్‌‌ (విరుద్ధ ప్రయోజనాల) సెగ తగిలింది. నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ (ఎన్‌‌సీఏ) హెడ్‌‌ కోచ్‌‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అతనికి ‘కాన్‌‌ఫ్లిక్ట్‌‌’అడ్డొస్తోంది. దాంతో, ఈ నెల ఒకటో తేదీనే కోచ్‌‌గా చార్జ్‌‌ తీసుకోవాల్సి ఉన్న రాహుల్‌‌ ఇంకా ఆ పని చేయలేదు. ప్రస్తుతం అతను ఇండియా సిమెంట్స్‌‌ ఉద్యోగిగా కూడా ఉండడమే అందుకు కారణం. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు పదవులు చేపట్టకూడదు. అందువల్ల ఎన్‌‌సీఏ బాధ్యతలు స్వీకరించాలంటే రాహుల్‌‌ ముందుగా ఇండియా సిమెంట్స్‌‌ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.