బడ్జెట్ లో సామాన్యులను పట్టించుకోలే..యువతకు ఉద్యోగాల్లేవ్

బడ్జెట్ లో  సామాన్యులను పట్టించుకోలే..యువతకు ఉద్యోగాల్లేవ్

ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం 

ఈ బడ్జెట్​ ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది. దేశంలోని 140 కోట్ల మంది ఆకాంక్షలకు ఈ పద్దు ప్రతిబింబం. వికసిత్‌‌ భారత్‌‌ నిర్మాణానికి బలమైన పునాది. క్యాపెక్స్‌‌, అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతూకం పాటించింది. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. దేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌‌గా మార్చేందుకు పన్ను రాయితీలు ఇచ్చాం.-  
- ప్రధాని నరేంద్ర మోదీ

సామాన్యులను పట్టించుకోలే

యువతకు ఉద్యోగాల్లేవ్.. తయారీ రంగం కుదేలవుతున్నది. ఫారిన్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుపోతున్నరు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోలేదు. వీటికి బడ్జెట్‌‌‌‌లో ఎలాంటి పరిష్కారాలు చూపలేదు. సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించింది. 
- రాహుల్ గాంధీ