రాజ్యాంగ వ్యవస్థలపై బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దాడి చేస్తుందన్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. లోక్ సభలో SIR పై మాట్లాడిన రాహుల్ గాంధీ..ఎన్నికల సంఘాన్ని బీజేపీ , RSS గుప్పిట్లోపెట్టుకున్నాయని ఆరోపించారు. ఆర్ ఎస్ ఎస్ అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని RSS క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. CEC, CJI ఎంపికలోనూ పారదర్శకత లేదన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ స్పీచ్ ను బీజేపీ ఎంపీలు అడ్డుకోగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రతిదాడికి దిగారు.
ఓటర్ల లిస్టులో లక్షలాది నకలీ ఓట్లు ఉన్నాయి. బీహార్ లో 1.20 లక్షల నకిలీ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హర్యానా, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోనూ లక్షలాది నకిలీ ఓట్లు ఉన్నాయన్నారు.. SIR పేరుతో జరిగే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించాం..ఎన్నికల సంఘం మా ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు రాహుల్ గాంధీ.
ఈవీఎంలలో డేటాను ఎందుకు మార్చుతున్నారన్న రాహుల్ గాంధీ.. ఓట్ చోరీ అనేది యాంటీ నేషనల్ ప్రక్రియ కాదా అని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసి ఫుటేజ్ ని ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముగిసిన 45 రోజుల్లో డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారాయన.

