
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది పట్నా కోర్టు. బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ వేసిన పరువు నష్టం కేసులో… పట్నాలోని కోర్టుకు హాజరయ్యారు రాహుల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా… ప్రధాని మోడీని విమర్శిస్తూ మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనన్నారు. పరోక్షంగా నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలను టార్గెట్ చేస్తూ ఆ మాటలన్నారు రాహుల్. ఆ వ్యవహారంలో రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ పరువు నష్టం దావా వేశారు.
అది శనివారం విచారణకు రాగా… రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. RSS, నరేంద్ర మోడీల విధానాలను ప్రశ్నించేవారిపై దాడి జరుగుతోందన్నారు రాహుల్. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, పేదలు, రైతులకు మద్దతుగా తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.