ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ కూడా ఉగ్రవాది: రాహుల్‌ గాంధీ

ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ కూడా ఉగ్రవాది: రాహుల్‌ గాంధీ

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ కూడా ఉగ్రవాదే అన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. ఉగ్రవాది అయిన గాడ్సేను…మరో ఉగ్రవాది అయిన ప్రజ్ఞా సింగ్… దేశభక్తుడని అన్నారని ఆరోపించారు. భారత పార్లమెంట్‌ చరిత్రలోనే ఇదో దుర్దినం అంటూ రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. RSS,BJP మనసులోని మాటే ఆమె నోట వచ్చిందన్నారు. ప్రజ్ఞాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడం కూడా టైం వేస్ట్ చేసుకోవడమేనని ఆరోపించారు. మరోవైపు ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది. ఢిఫెన్స్ ప్యానల్ నుంచి కూడా తొలగించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పింది.