
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి అన్ని రంగాలను లాక్ డౌన్ చేయటం కారణంగా కొత్త కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. రైతులు, డెయిలీ లేబర్స్, మెగ్రెంట్ లేబర్, స్మాల్ ట్రేడర్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ స్మార్ట్ గా అప్ గ్రేడ్ చేయాలంటూ ట్విట్టర్ ద్వారా కేంద్రానికి సూచించారు. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు చాన్ ఇవ్వాలని కోరారు. ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్ లు నిర్వహిస్తూ కరోనా హాట్ స్పాట్ లను ఐసోలేట్ చేయాలని కోరారు. లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలని రాహుల్ కోరారు. ఐతే లాక్ డౌన్ ను మే 3 వరకు పొడగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. 20 వ వరకు యధావిధిగా లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ తర్వాత దశల వారీగా ఆంక్షలు ఎత్తి వేస్తామన్నారు. రైతులు, పేదలకు ఎలాంటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.