వారసుడిని పార్టీనే డిసైడ్‌ చేస్తుంది : రాహుల్

వారసుడిని పార్టీనే డిసైడ్‌ చేస్తుంది : రాహుల్

న్యూఢిల్లీ: తన వారసుణ్ని నిర్ణయించేది పార్టీయేనని కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌ గా రాహుల్‌‌‌‌గాంధీ క్లారిటీ ఇచ్చారు. దీంట్లో తన నిర్ణయం ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌ గా ఎవరొస్తారన్న మీడియా ప్రశ్నపై రాహుల్‌‌‌‌  గురువారం రియాక్ట్‌‌‌‌ అయ్యారు. లోక్‌‌‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వా త పార్టీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాహుల్‌‌‌‌ ప్రకటించారు. కాంగ్రెస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ కమిటీ మాత్రం ఆయన నిర్ణయాన్ని అంగీకరించలేదు. అన్ని స్థా యిల్లోనూ పార్టీని బలోపేతం చేయాలని సీడబ్ల్ యూసీ ఆయనను కోరింది.

రాష్ ట్రపతి ప్రసంగంలో రాఫెల్‌‌‌‌ అంశాన్ని ప్రస్తావించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ …ఈ డీల్‌‌‌‌లో అవినీతి చోటుచేసుకుందని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాఫెల్‌‌‌‌ ఫైటర్‌‌‌‌  జెట్‌‌‌‌ డీల్‌‌‌‌లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని ఇప్పటికే సీవీసీకి ఫిర్యా దు చేసినట్టు రాహుల్‌‌‌‌  గుర్తుచేశారు.