
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇటీవలే మళ్లీ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. వాయనాడ్ నుంచి పార్లమెంటు సభ్యునిగా తిరిగి చేరిన తర్వాత తాజాగా ఆయన తన అధికారిక ప్రభుత్వ బంగ్లాను తిరిగి పొందారు. లోక్‌సభ హౌస్ కమిటీ గాంధీకి పాత బంగ్లాను కేటాయించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ 2005 నుంచి దేశ రాజధానిలోని 12, తుగ్లక్ లేన్ బంగ్లాలో నివసిస్తున్నారు. ఇటీవల మోడీ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో కోర్టు.. దాన్ని ఖాళీ చేయమని చెప్పిన విషయం తెలిసిందే.
లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ఉత్తర్వు జారీ చేయడంతో రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంటు సభ్యునిగా నియమితులయ్యారు. 'మోదీ ఇంటిపేరు' కేసులో దోషిగా తేలిన కారణంగా గాంధీ పార్లమెంటరీ సభ్యుడి పదవికి అనర్హుడయ్యేలా చేసిన మునుపటి ఉత్తర్వులను ఈ కొత్త ఉత్తర్వు సమర్థవంతంగా రద్దు చేసింది. మధ్యంతర ఉత్తర్వు ద్వారా గాంధీకి విధించిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి సుప్రీంకోర్టు ఇటీవలే ఆయనకు ఉపశమనం కలిగించింది.