గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బందితో సహా 25మంది మృతిచెందారు. సిలిండర్ పేలడంతో జరిగిన ఈ ప్రమాదానికి జరిగింది. అయితే ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడానికి, క్లబ్ పూర్తిగా కాలిబూడిదై పోవడానికి కారణం నైట్‌క్లబ్ లేఅవుట్ అనే ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇరుకైన ఎంట్రీ ,ఎగ్జిట్ పాయింట్లే కారణమ,బ్యాక్ వాటర్స్ పబ్ మార్గం వల్ల మంటలార్పడం చాలా కష్టమైందని తెలిపారు. దీంతో చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ లోకి వెళ్లి ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటనపైప్రతిపక్ష నేత రాహుల్ తీవ్రంగా గాంధీ స్పందించారు. ఇది భద్రతా పరంగా పూర్తి వైఫల్యం అన్నారు. ఇది ప్రమాదం కాదు.. హత్య అని స్పష్టం చేశారు. సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. పై అంతస్తులో మంటలు చెలరేగాయి.. ఎగ్జిట్, ఎంట్రీ డోర్స్ ఇరుకుగా ఉండటంతో క్లబ్ లోని ఉన్న వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. మరణించిన వారిలో చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ లోకి వెళ్లగా అక్కడ ఊపిరాడక చనిపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు.
రూల్స్ విరుద్ధంగా నైట్‌క్లబ్..?
అర్పోరా-నాగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్ క్లబ్ ను రూల్స్ అతిక్రమించి కట్టారని అన్నారు. నోటీసులు కూడా ఇచ్చాం.. కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు. రూల్స్ అతిక్రమించడం వల్లే ఈ ప్రమాదంలో అధిక నష్టం జరిగిందన్నారు. హోటల్ జనరల్ మేనేజర్లు ,యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఫైర్ భద్రత, నిర్మాణ నిబంధనలు పాటించారా లేదా అనే కోణంగా దర్యాప్తు చేపట్టామన్నారు గోవా సీఎం.
