తెలంగాణలో బీజేపీ బీటీంను ఓడించాం..లోక్సభ ఎన్నికల్లో మోదీని కూడా ఓడిస్తామని రాహుల్గాంధీ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ సర్కార్ ఫ్రీజ్ చేస్తోందన్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, ఐటీ ఉంటే.. మా దగ్గర ప్రజలు ఉన్నారని చెప్పారు.ఈ మేనిఫెస్టో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తే అమలు చేసి తీరుతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
బీజేపీ అతిపెద్ద వాషింగ్ ను నడుపుతోంన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీలో చేరగానే అవినీతి పరులంతా నీతిమంతులవుతున్నారని అన్నారు. దేశంలో అధికార దుర్వినియోగానికి మోదీ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఈసీ సహా అన్ని సంస్థల్లోనూ బీజేపీ వాళ్లున్నారని ఆరోపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు వసూళ్ల సంస్థగా మారిందన్నారు రాహుల్ గాంధీ. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రోరల్ బాండ్లు అన్నారు రాహుల్గాంధీ. సీబీఐ దర్యాప్తు సంస్థ వ్యాపారస్తులను భయపెడుతోందన్నారు.