రాహుల్ ఎందుకొస్తున్నారో చెప్పాలె

 రాహుల్ ఎందుకొస్తున్నారో చెప్పాలె

రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారో చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు హరీష్.  అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతకైనా దిగజారుతారన్నారు. తమది బతుకు దెరువు కోసం ఆరాటమని ..కాంగ్రెస్ పార్టీది కుర్చీల కోసం కొట్లాట అని అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు అవుతుందన్నారు. 

రాహుల్ బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయ్యిందన్నారు. మిస్టర్ బండి సంజయ్.. కేంద్రంలో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలన్నారు.  90 వేల ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే .. వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత. రైతుల కష్టాలు, కన్నీళ్లు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్లు రాక పంటలు ఎండి పోయేవి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి హరీష్.