ఈడీ ఆఫీసు నుంచి బయటకొచ్చిన రాహుల్

ఈడీ ఆఫీసు నుంచి బయటకొచ్చిన రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లగా.. దాదాపు 3గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిన రాహుల్ లంచ్ తర్వాత తిరిగి ఈడీ ఆఫీసుకు రానున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మనీలాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 50 కింద మరో అధికారి రాహుల్ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

https://twitter.com/ANI/status/1536273734985584640?cxt=HHwWgMCgudG0-NEqAAAA

ఈడీ ఆఫీసులో 3గంటల పాటు సాగిన విచారణలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా కంపెనీలతో ఉన్న సంబంధాలతో పాటు ఆయా సంస్థల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై  ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ సోదరి ప్రియాంక అరెస్టై తుగ్లక్ రోడ్ జైలులో ఉన్న కార్యకర్తలను పరామర్శించారు.