డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్స్తో రాహుల్ గాంధీ భేటీ

 డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్స్తో  రాహుల్ గాంధీ భేటీ

హైదరాబాద్ లో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల  ప్రచారం కొనసాగుతుంది.  నగరంలో వివిధ వర్గాలతో  రాహుల్ భేటీ అవుతున్నారు. అందులో భాగంగా నవంబర్ 28వ తేదీ ఉదయం జూబ్లీహిల్స్ లో  డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్స్ తో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ కు వారి తమ సమస్యలను చెప్పుకున్నారు. 

 తమకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు.  సంపాదించనదంతా పెట్రోల్ కే పోతుందని ఆవేదన  వ్యక్తం చేశారు.  డబుల్ బెడ్ రూమ్, పెన్షన్లు ఇవ్వడం లేదని శానిటరీ వర్కర్స్ రాహుల్ తో చెప్పారు. గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్ లో ఒక స్కీమ్ ఆమలు చేస్తున్నామని రాహుల్ వారికి తెలిపారు. 

 ప్రతి ట్రాన్సాక్షన్ లో కొంత భాగాన్ని  గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నట్లు రాహుల్ చెప్పారు.  ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.