మోడీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచారు: రాహుల్

మోడీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచారు: రాహుల్

మోడీ  అబద్ధాలు చెప్పి లోక్ సభ ఎన్నికల్లో  గెలిచారని  విమర్శించారు  కాంగ్రెస్  అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ.  అబద్ధాలు,  ద్వేషానికి  మోడీ  ప్రతినిధని  ఆరోపించారు.  దేశ ప్రజలను  విడగొట్టేందుకు   మోడీ విషం  చిమ్ముతున్నారని   ఫైరయ్యారు రాహుల్. కేరళ  వయనాడ్  నియోజకవర్గంలో   రోడ్ షోలో  పాల్గొన్నారు.  వయనాడ్ నుంచి గెలిచిన  తర్వాత  తొలిసారిగా  నియోజకవర్గానికి  వచ్చిన  ఆయనకు పార్టీ  శ్రేణులు ఘనంగా  స్వాగతం పలికారు.  రోడ్ షోలో  పాల్గొని  శ్రేణులను  ఉత్సాహపరిచారు  రాహుల్.