ఆదివాసీలే.. భూములకు నిజమైన యజమానులు

ఆదివాసీలే.. భూములకు నిజమైన యజమానులు

వయనాడ్(కేరళ): ఆదివాసీలను అడవులకే పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దేశానికి నిజ‌‌‌‌‌‌‌‌మైన య‌‌‌‌జ‌‌‌‌మానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడ‌‌‌‌విపై హ‌‌‌‌క్కులను గిరిజ‌‌‌‌నుల‌‌‌‌కు అందించాల‌‌‌‌ని డిమాండ్​ చేశారు.  ఆదివాసీలను వనవాసీలుగా పిలుస్తూ వారి అడవి నుంచి బయటికి రాకుండా బీజేపీ చూస్తున్నది మండిపడ్డారు. ట్రైబల్ కమ్యూనిటీని బీజేపీ అవమానిస్తున్నదని ఫైర్ అయ్యారు. వారి నుంచి భూమి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నది ఆరోపించారు. వయనాడ్​ జిల్లా నల్లూర్​నాడ్​లోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్​లో హెచ్​టీ కనెక్షన్​ను రాహుల్ ప్రారంభించి మాట్లాడారు. గిరిజనులను వనవాసీలుగా పిలవడం వెనుక పెద్ద లాజిక్ ఉందన్నారు. తాను దేశ‌‌‌‌వ్యాప్తంగా పర్యటించినప్పుడు ఎంతో మంది గిరిజనులను కలిశానని, ఆదివాసీలంటే భూమికి నిజ‌‌‌‌మైన యజమానులని అర్థం వస్తుందని తెలిపారు. ఈ దేశానికి య‌‌‌‌జ‌‌‌‌మానులైన గిరిజ‌‌‌‌నులు త‌‌‌‌మ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చూడాల‌‌‌‌న్నారు. 

ఆదివాసీ చరిత్ర వక్రీకరిస్తున్నారు

అడ‌‌‌‌వులు, భూములు, అట‌‌‌‌వీ ఉత్పత్తులపై గిరిజ‌‌‌‌నుల‌‌‌‌కే హ‌‌‌‌క్కుల‌‌‌‌ను చెందేలా చూడాల‌‌‌‌ని రాహుల్ కోరారు. కాంగ్రెస్​కు ఎప్పుడూ ఆదివాసీలే అని, అటవీ భూములకు యజమానులే అని అన్నారు. వనవాసి అనే పదం ఆదివాసీ వర్గాల చరిత్ర, సంప్రదాయాలను వక్రీకరించడం, దేశంతో వారికి సంబంధం లేకుండా చేయడమే బీజేపీ సిద్ధాంతం విమర్శించారు. దీనికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఆదివాసీలు అడవులను కాపాడుతుంటే.. కొందరు అభివృద్ధి పేరుతో వాటిని తగులబెడ్తున్నారని, కాలుష్యానికి కారకులు అవుతున్నారని విమర్శించారు. క్యాన్సర్ సెంటర్​తో పాటు ఈ ఏరియాలో పవర్ కట్ సమస్యకు పరిష్కరం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని కోసం తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50లక్షలు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధికారుల కృషి ఫలితంగా అదనంగా రూ.5 కోట్లు వస్తాయని తెలిపారు.