తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్.. సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు

తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్..  సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు
  • తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్
  • సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు
  • ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం
  • మీతో నాది కుటుంబ సంబంధం
  • మల్కాజిగిరి రోడ్ షోలో రాహుల్ గాంధీ

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ మల్కాజ్ గిరిలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో తమది రక్త సంబంధమని, కుటుంబ బంధమని చెప్పారు. ఇందిరా గాంధీ నుంచి తమ వరకు ఆత్మ సంబంధమని అన్నారు. కుట్రలు, హింస లేని భారత్ కోసం తాను భారత్ జోడో యాత్ర చేసినట్టు చెప్పారు. తనపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందని, తనకు ఇచ్చిన క్వార్టర్ ను వాపస్ తీసుకుందని చెప్పారు. తెలంగాణలో ఇంత అవినీతి జరుగుతున్న కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ఈడీ, ఐటీ, సీబీఐ కేసులెందుకు పెట్టడం లేదన్నారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని రాహుల్ పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పోటీ చేస్తుంది కానీ, తెలంగాణలో చేయదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కించి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ సర్కారులో నిరుద్యోగులకు కొలువు రాలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలే కథానాయకులై పోలింగ్ రోజు ముందు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.