పేదరికంపై సర్జికల్ స్ట్రైక్

పేదరికంపై సర్జికల్ స్ట్రైక్

జైపూర్: నిరుపేదలకు కనీస ఆదాయం హామీ.. పేదరికంపై కాంగ్రెస్ చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. న్యూనతమ్ ఆయ్ యోజన (న్యాయ్)కు సంబంధించి ఆర్ బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తోపాటు ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తలను సంప్రదించినట్లు ఆయన చెప్పారు. “ఆరు నెలలుగా ఈ పథకం కోసం పనిచేశాం. దీన్ని ఎలా అమలు చేయాలని ఆలోచించాం. చర్చలు, మేధోమథనం తర్వాత నెలకు రూ.12 వేల ఇన్ కం లైన్ లో ఉండాలని అనుకున్నాం. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇండియాలో నెలవారీ కనీస ఆదాయం 12 వేలు అవుతుంది” అని అన్నారు.మంగళవారం రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలోని సూరత్ గఢ్ పట్టణం, బుండి , జైపూర్ లో బహిరంగసభల్లో మాట్లాడి న ఆయన బీజేపీని ఎండగట్టారు.”యూపీఏ ప్రభుత్వం 14 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిం ది. మోడీ సర్కారు మళ్లీ వాళ్లని పేదరికంలోకి నెట్టిం ది. బీజేపీ పేదలను నిర్మూలించేందుకు పని చేసింది. మేము పేదరికా న్నినిర్మూలిస్తాం. 21వ శతాబ్దంలో ఎవరూ పేదలుగా ఉండకూడదు.2014లో బీజేపీ అదృష్టవశాత్తుగెలిచింది. ప్రధాని మోడీ శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలకు డబ్బులిచ్చారు. కాంగ్రెస్ అలా కాదు..పేదలకు సేవ చేస్తోంది. డిమానిటై జేషన్ సమయంలోగుజరాత్ లోని బీజేపీ జాతీయ అధ్యక్షుడి బ్యాంకులోరూ.700 కోట్ల మేర పెద్ద నోట్లు మార్చారు. అమిత్ షా కుమారుడి వ్యాపారం రూ.50 వేల కోట్లకు పెరిగింది. జైట్లీ కూతురు అకౌంట్ కు మెహుల్ చోక్సీ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. దేశం నుంచి పారిపోక ముందు విజయ్ మాల్యా అరుణ్  జైట్లీని పార్లమెంటులోకలిశారు” అని ఆరోపణలు గుప్పిం చారు. రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని, బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని గత ఎన్నికల్లో మోడీ హామీ ఇచ్చిన విషయాన్నిగుర్తు చేసిన ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు, డబ్బులూ వేయలేదని దుయ్యబట్టారు. తాను ప్రధాని కాదని చౌకీదార్ ని చెప్పుకునే మోడీ అనిల్అంబానీ లాంటి వారికి చౌకీదార్ గా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. ఆయన హామీలపై ప్రశ్నిస్తే తప్పిం-చుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాజన్ సపోర్ట్

‘న్యాయ్’ అట్టడుగువర్గా ల జీవితాల్లో మార్పుతీసుకురాగలదని రిజర్వ్ బ్యాంక్ మాజీగవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డా రు.అయితే కేంద్రం ఇప్పుడిస్తు న్న తాయిలాలకున్యాయ్ స్కీం తోడైతే సబ్సిడీల భారం 7లక్షలకోట్లకు చేరుతుందని, ఆర్థిక కోణంలో ఇదితలకుమించిన భారమవుతుందని అన్నారు .పకడ్బందీగా అమలు చేయగలిగితే పథకంసక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువన్నారు .