CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ : ప్రధాని తీరును ఎత్తిచూపిన రాహుల్

CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ : ప్రధాని తీరును ఎత్తిచూపిన రాహుల్

CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ : ప్రధాని తీరును ఎత్తిచూపిన రాహుల్

CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలు కనరిపించటం లేదా..లక్షల మంది పిల్లలు బాధలు కనిపించటం లేదా.. పిల్లల తల్లిదండ్రుల ఆక్రందనలు వినిపించటం లేదా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీకి జవాబుదారీతనం లేకపోవటం సిగ్గు చేటన్నారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.ఈ వ్యవహారంపై  రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫలితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని మండిపడ్డారు. ఈ దారుణంపై ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని.. ఆయన వద్ద ఎలాంటి సమాధానాలు, జవాబుదారీతనం లేవంటూ ఎక్స్ (X) వేదికగా రాహుల్ ఫైర్ అయ్యారు.

ఈ మొత్తం వివాదం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఎస్ఈ మూల్యాంకన బాధ్యతలు అప్పగించిన కోఎంప్ట్ (COEMPT) అనే కంపెనీ నేపథ్యాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంలో చిక్కుకున్న 'గ్లోబరేనా' (Globarena) కంపెనీయే.. ఇప్పుడు పేరు మార్చుకుని 'కోఎంప్ట్'గా అవతరించిందని రాహుల్ ఆరోపించారు. పేరు మారినా ఆ కంపెనీ ఉద్దేశం, స్వభావం మాత్రం మారలేదన్నారు. ఇంతటి వివాదాస్పద చరిత్ర ఉన్న కంపెనీకి, నిబంధనలను ఉల్లంఘించి మరి సీబీఎస్ఈ కాంట్రాక్టును ఎందుకు అప్పగించారని రాహుల్ ప్రశ్నించారు. అసలు ఆ కంపెనీ యాజమాన్యానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటని నిలదీశారు.

ఈసారి ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రీ-వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులకు సీబీఎస్ఈ పంపిన స్కాన్ చేసిన జవాబు పత్రాల్లో.. తమ హ్యాండ్ రైటింగ్ సరిపోలడం లేదని విద్యార్థులు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది.

ఈ క్రమంలో  విద్యార్థులకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. మీ కష్టాన్ని, మీ భవిష్యత్తును దొంగిలించడానికి ఎవరినీ అనుమతించబోం" అని స్పష్టం చేశారు. ఈ ఘోర అవకతవకలపై తక్షణమే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని, స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.