నవంబర్ 17న రాహుల్ గాంధీ పర్యటన..ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం

నవంబర్ 17న రాహుల్ గాంధీ పర్యటన..ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాహుల్​ గాంధీ టూర్​ ఖరారైంది. శుక్రవారం ఒక్కరోజే ఐదు నియో జకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ మేరకు బుధవారం రాహుల్​ ఒక్క రోజు టూర్​ షెడ్యూల్​ను ఏఐసీసీ విడుదల చేసింది. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్​కు రానున్న రాహుల్.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఉదయం 11 గంటలకు పినపాకకు వెళ్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ రోడ్​షోలో పాల్గొని కార్నర్​ మీటింగ్​ నిర్వహిస్తారు. పినపాక నుంచి హెలికాప్టర్​లో నర్సంపేటకు వెళ్లి.. అక్కడ సభ నిర్వహిస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్​ ఈస్ట్​కు సాయంత్రం 4 గంటలకు చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్​ వెస్ట్​కు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తారు.  సాయంత్రం 6.30 గంటలకు రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొని.. తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

అదే రోజు ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.