వయనాడ్ సమస్యలు పరిష్కరిస్తా: రాహుల్ గాంధీ

వయనాడ్ సమస్యలు పరిష్కరిస్తా: రాహుల్ గాంధీ

వయనాడ్ సమస్యలు క్లిష్టమైనవైనా పరిష్కరిస్తానని చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వయనాడ్ లో అందరికీ తలుపు తెరిచే ఉంటుందన్నారు. ఈ రోజు కోజికోడ్ లో రోడ్ షో లో పాల్గొన్నారు రాహుల్. ద్వేషంతో ప్రధాని మోడీ, బీజేపీ కళ్లు మూసుకుపోయాయని విమర్శించారు. లోక్ సభలో కేరళ సమస్యలపై పోరాడుతానన్నారు రాహుల్. అయితే కేరళ సమస్యలపై ప్రధాని మోడీ స్పందిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, మిగితా రాష్ట్రాల్లో మరోలా ఉంటారని ఫైర్ అయ్యారు. యూపీని చూసినట్లుగా కేరళని మోడీ చూడబోరని అన్నారు. వారణాసి, కేరళ ఒకటే అని మోడీ చెప్పారని కానీ అది నిజం కాదన్నారు. కేరళను కేరళ ప్రజలే పాలించాలని, ప్రధానమంత్రి కార్యాలయం కాదన్నారు రాహుల్ గాంధీ.