కాంగ్రెస్​ నుంచి గోషామహల్​ బరిలో రాహుల్​ సిప్లిగంజ్​?

కాంగ్రెస్​ నుంచి గోషామహల్​ బరిలో రాహుల్​ సిప్లిగంజ్​?
  • కాంగ్రెస్​ నుంచి గోషామహల్​ బరిలో రాహుల్​ సిప్లిగంజ్​?
  • బీజేపీ తరఫున కామారెడ్డి నుంచి విజయశాంతి 
  • సికింద్రాబాద్​లో పోటీ చేయనున్న జయసుధ!
  • బీఆర్​ఎస్​ తరఫున జాతీయ రాజకీయాల్లోకి జయప్రద?

హైదరాబాద్​, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా గ్లామర్​ స్పెషల్​ ఎట్రాక్షన్​గా నిలవనుంది. కాంగ్రెస్​, బీఆర్​ఎస్, బీజేపీ తరఫున పలువురు సినీ సెల బ్రిటీలు బరిలో నిలవడానికి సిద్ధమవు తున్నారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి  సింగర్​ రాహుల్​ సిప్లిగంజ్​​పోటీ చేయనున్నట్లు ప్రచా రం జరుగుతున్నది. ఆస్కా ర్​ విన్నింగ్​ సాంగ్​తో అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన్ను పార్టీ తరఫున పోటీలో నిలపాలని కాం గ్రెస్​ పెద్దలు భావిస్తున్నట్టు తెలి సింది. రాహుల్​ సిప్లిగంజ్​కు ఉన్న ఫాలోయింగ్​ పార్టీకి కొంతైనా మేలు చేస్తుందన్న యోచనలో ఉన్నట్టు టాక్​.

ఇటీవల రాజీవ్​ గాంధీ యూత్​ క్విజ్​ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా రాహుల్​ సిప్లిగంజ్​ను కాంగ్రెస్​ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన్ను గోషామహల్​ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్​ నేతలు అడిగినట్టు తెలిసింది. దీనిపై చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయితే, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని, వేరే నియోజకవర్గం నుంచి పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలను రాహుల్​ సిప్లిగంజ్​ కోరినట్లు కాంగ్రెస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆ నియోజకవర్గం ఏమిటన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్​గానే ఉంది. 

బీజేపీ నుంచి విజయశాంతి, జయసుధ

బీజేపీలోనూ పలువురు సినీ ప్రముఖులు ఈ సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. సినీ నటి, పొలిటీషియన్​  విజయశాంతి ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. ఆమె ఇప్పుడు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఆకట్టుకునేలా మాట్లా డడం, వైరి పక్షాలపై ఆమె స్టైల్​ విమర్శలు బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. ఇటీవల మరో సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. 2009 వైఎస్​ హయాంలో కాంగ్రెస్​ తరఫున సికింద్రాబాద్​ నుంచి పోటీ చేసిన ఆమె.. మంచి మెజారిటీతో విజయం సాధించారు. 

ఆ తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. జయసుధను సికింద్రాబాద్​ లేదా ముషీరాబాద్​ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు బీఆర్​ఎస్​లో సినీ నటి జయప్రద చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలని బీఆర్​ఎస్​ నేతలు భావిస్తున్నట్టు పొలిటి కల్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.