హైదరాబాద్ టీజీఐఐసీసీలో భూముల వేలంలో సంచలన ధర నమోదైంది. రాయదుర్గం పాన్ మక్తాలో ఎకరం రూ. 237 కోట్లు పలికింది. సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల వేలం ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరా రూ.177 కోట్ల పలికింది. అపుడు 7 ఎకరాల మొత్తం రూ. 1357ల కోట్లకు పై ఆదాయం వచ్చింది.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) భూములకు మస్తు డిమాండ్ వస్తోంది. నిరుడు అక్టోబర్‌లో ఎకరానికి రూ.177 కోట్లు పలికిన భూముల ధరలు.. అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా రాయదుర్గంలోని పాన్ మక్త భూములను టీజీఐఐసీ వేలం నిర్వహిస్తోంది. .
సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 1ఏ, 1ఎఫ్‌లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తంగా 11.38 ఎకరాల భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎకరాకు రూ.139 కోట్లుగా అప్‌సెట్ ప్రైస్‌ను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లాట్ నెంబర్ 1ఏ, 1ఎఫ్‌లోని భూములకు మే 28న వేలం జరుగుతుండగా, ప్లాట్ నెంబర్ పీ4లోని భూములకు జూన్ 1న ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు.
