2027లో ప్రతి ఒక్కరికి కన్ఫార్మ్ టికెట్!

2027లో  ప్రతి ఒక్కరికి కన్ఫార్మ్ టికెట్!

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికీ 2027 నాటికి కన్ఫార్మ్ టికెట్ అందజేయాలని రైల్వే శాఖ ప్లాన్​ చేస్తోంది. అందుకోసం భారీ విస్తరణ  ప్రణాళికలు చేపట్టింది. రైల్వే అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. .రైల్వే శాఖ  ప్రతి ఏడాది 4 వేల నుంచి 5 వేల కిలోమీటర్ల కొత్త ట్రాకులు వేయాలని చూస్తున్నది. ప్రస్తుతం రోజుకు 10,478 ట్రైన్స్ నడుస్తుండగా.. వాటి ని రాబోయే 34 ఏళ్లలో  13 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

అందుకోసం 3000 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టాలనే ఆలోచన లో ఉంది.  ప్రస్తుతం  రైళ్ల ద్వారా ఏడాదికి 800 కోట్ల మంది ప్రయాణి స్తుండగా.. ఆ సంఖ్యను మరింత పెంచి 1000 కోట్ల మందిని చేరవే యాలని ప్లాన్​ చేస్తున్నది. కొత్త ట్రాకులు వేయ డంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేందు కు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, రైల్వే ప్రణాళికలు కనుక సాకారమైతే 2027 నాటికి ప్రతి ఒక్కరికి కన్ఫార్మ్ టిక్కెట్ అందుతుంది.