
మహారాష్ట్ర చంద్రాపూర్ లోని బల్హార్ష రైల్వే జంక్షన్ లో ప్రమాదం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ కూలి.. 20 అడుగుల ఎత్తు నుంచి నలుగురు ప్రయాణికులు రైల్వేట్రాక్ మీద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కావడంతో సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ కూలడంతో.. తోటి ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరూ చనిపోలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి లక్ష, స్వల్ప గాయాలు అయిన వారికి 50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు రైల్వే స్టేషన్ లోని 1వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి 4వ నంబర్ ప్లాట్ ఫాం పైకి ప్రయాణికులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుణె కు వెళ్లే రైలును ఎక్కేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుంచి వెళ్తుండగా దాని కొంత భాగం కిందికి వంగిపోయింది.