రైల్వేలో 368 కంట్రోలర్ పోస్టులు: డిగ్రీ ఉంటే పర్మినెంట్ జాబ్..

రైల్వేలో 368 కంట్రోలర్ పోస్టులు: డిగ్రీ ఉంటే పర్మినెంట్ జాబ్..

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్ఆర్​బీ) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 14.

పోస్టుల సంఖ్య: 368 (సెక్షన్ కంట్రోలర్) 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత పొంది ఉండాలి. పూర్తి వివరాల కోసం ఆర్ఆర్​బీ సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్​మెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ చూడవచ్చు. 

వయోపరిమితి: 20 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 15. 

లాస్ట్ డేట్:  అక్టోబర్ 14.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు, మహిళలకు రూ.250. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక  చేస్తారు. 

పూర్తి వివరాలకు  indianrailways.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | UPSC నోటిఫికేషన్ విడుదల.. భారీగా పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..