
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్ సీ) వివిధ విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 11.
పోస్టుల సంఖ్య: 84,
పోస్టులు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 19, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 25, లెక్చరర్ 40.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఎడ్, ఎల్ఎల్బీ, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 23.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.