స్కూళ్లు లేని చోటే రైల్వే స్కూల్స్..పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

స్కూళ్లు లేని చోటే రైల్వే స్కూల్స్..పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సరిపడా లేని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న వనరుల మేరకు రైల్వే పాఠశాలలు ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది.రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో రైల్వే ఉద్యోగుల పిల్లలకు తగినన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. 

బుధవారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బెల్లంపల్లిలోని రైల్వే ఈపీసీ హైస్కూల్ నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతోందని తెలిపారు. ఈ పాఠశాలను రైల్వే శాఖ నిర్వహించడం లేదని, ఎంప్లాయీస్ పేరెంట్స్ కమిటీ (ఈపీసీ) నిర్వహణ బాధ్యతలు చూస్తోందన్నారు నాన్‌‌‌‌‌‌‌‌-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు (లెవల్‌‌‌‌‌‌‌‌–4 వరకు) పొందుతున్న చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్టాఫ్ బెనిఫిట్ ఫండ్‌‌‌‌‌‌‌‌ ద్వారా స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.