అంబేద్కర్ యాత్ర పేరుతో రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజ్

అంబేద్కర్ యాత్ర పేరుతో రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజ్

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ ద్వారా అంబేద్కర్కు అనుబంధమున్న ప్రాంతాలన్నింటినీ చుట్టివచ్చేలా ఐఆర్ సీటీసీ ఈ టూర్ ప్లాన్ చేసింది. 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో అంబేద్కర్ జీవిత విశేషాలతో పాటు బౌద్దుల వారసత్వాన్ని పరిచయం చేయనున్నారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఈ రైలు యాత్ర ప్రారంభం కానుంది. 

ఏప్రిల్ 14న ఢిల్లీ సఫ్దర్ జంగ్ నుంచి  ప్రారంభం కానున్న ట్రైన్.. డాక్టర్ అంబేద్కర్ నగర్, నాగ్ పూర్, సాంచి, వారణాసి, గయ మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకోనుంది. ఢిల్లీ, నాగ్ పూర్, సాంచీ, వారణాసి, సారానాథ్, బుద్దగయా, రాజ్ గిర్, నలంద తదితర ప్రాంతాల్లోని అంబేద్కర్తో పాటు బౌద్దులకు సంబంధించిన విశేషాలను తెలిపే పర్యాటక ప్రదేశాలను  టూరిస్టులకు చూపించనున్నారు. ఈ ట్రైన్ లో మొత్తం 600 మంది ప్రయాణించే అవకాశముంది. టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 21,650గా నిర్ణయించారు.