పిల్లల చార్జీల పెంపు.. ఏడేండ్లలో రైల్వేకు రూ.2,800 కోట్లు

పిల్లల చార్జీల పెంపు.. ఏడేండ్లలో రైల్వేకు రూ.2,800 కోట్లు

న్యూఢిల్లీ: చిన్నారుల ప్రయాణ చార్జీల పెంపుతో ఇండియన్ రైల్వేస్​ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడేండ్లలో రూ.2,800 కోట్ల అదనపు ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. ఈ సమాచారం ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. సెంటర్​ రైల్వే ఇన్​ఫర్మేషన్​ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్​) తెలిపిన వివరాల ప్రకారం.. 2022‌‌‌‌–23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్ల ఆదాయం రైల్వేకు లభించడంతో మోస్ట్​ ప్రాఫిటబుల్​ ఇయర్​గా నమోదైంది.

Also Read : కలెక్టరేట్ ​ఎదుట అంగన్​వాడీల ధర్నా

కాగా, సీఆర్​ఐఎస్​రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రిజర్వుకోచ్​లో 12 ఏండ్లలోపు పిల్లలకు ప్రత్యేక సీట్లు లేదా బెర్త్​లు కావాలంటే పూర్తి చార్జీలు చెల్లించాల్సిందిగా రైల్వే మంత్రిత్వశాఖ మార్చి 31, 2016న ప్రకటించింది. సవరించిన నిబంధనలు ఏప్రిల్​ 21, 2016 నుంచి అమలులోకి వచ్చాయి.