
Vande Bharat: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం వందే భారత్ రైలు స్టేషనుకు చేరుకోవటానికి కేవలం 15 నిమిషాల ముందు టిక్కెట్ బుక్ చేసుకోవటానికి అనుమతిస్తున్నట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. అయితే ఈ కొత్త సేవలు కేవలం వందే భారత్ రైళ్లకు మాత్రమేనని పేర్కొంది.
రైలు ప్రయాణిస్తూ ఏదైనా రెండు స్టేషన్లకు మధ్య ఉన్నప్పుడు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మీరు ప్రయాణించే స్టేషనుకు వందే భారత్ రైలు చేరుకోవటానికి 15 నిమిషాలకు ముందు సీట్ బుక్కింగ్ చేసుకోవచ్చు ఇకపై. దీని ద్వారా రియల్ టైం టిక్కెటింగ్ తో పాటు సీట్ల ఆక్యుపెన్సీని మెరుగ్గా నిర్వహించవచ్చని రైల్వే సంస్థ భావిస్తోంది. తొలుతగా ఈ సౌకర్యాన్ని 8 మార్గాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు దక్షిణ భారత రైల్వై జోనులో.
- 20631 Mangaluru Central – Thiruvananthapuram Central
- 20632 Thiruvananthapuram Central – Mangaluru Central
- 20627 Chennai Egmore – Nagercoil
- 20628 Nagercoil – Chennai Egmore
- 20642 Coimbatore – Bengaluru Cantt.
- 20646 Mangaluru Central – Madgaon
- 20671 Madurai – Bengaluru Cantt.
- 20677 Dr MGR Chennai Central – Vijayawada
ఇందుకోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా కరెంట్ బుక్కింగ్ లేదా బుక్ నౌ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. మీరు రైలు ఎక్కే స్టేషన్ నుంచి డిపార్చర్ కావటానికి గంట మునుపు టిక్కెట్ బుక్ చేసుకోవటానికి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ టిక్కెట్ కన్ఫమ్ కాకపోతే ఆటోమెటిక్ గా క్యాన్సిల్ చేయబడుతుంది. ఇది చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకున్న వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.