ధర్మస్థల సమాధుల కేసు: తవ్వకాలు తిరిగి ప్రారంభించిన సిట్.. దొరకని ఆధారాలు.. ?

ధర్మస్థల సమాధుల కేసు: తవ్వకాలు తిరిగి ప్రారంభించిన సిట్.. దొరకని ఆధారాలు.. ?

గత కొద్దిరోజులుగా భారీగా వైరల్ అవుతున్న ధర్మస్థల సామూహిక సమాధుల కేసు విషయంలో నేడు తవ్వకాలు మళ్ళీ మొదలయ్యాయి. ఉదయం నేత్రావతి నది పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మళ్లీ చర్యలు ప్రారంభించారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి సాక్షి సమక్షంలోనే ఈ గాలింపు చర్యలు చేస్తున్నారు.

ఫిర్యాదుదారుడు సాక్షితో కలిసి వచ్చిన సిట్ బృందం నేత్రావతి స్నాన ఘట్టం దగ్గర పక్కనే ఉన్న హైవే అడవిలో ఇప్పటి వరకు గుర్తించిన 13, 10 చోట్ల మాత్రమే మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరిపాయి. సోమవారం 11వ చోట తవ్వాకాలు చేయాలనీ అనుకోగా అక్కడికి వెళ్లిన తరువాత తవ్వకాలు చేయలేదు. దీనిపై ఫిర్యాదు చేసిన సాక్షిని అడవిలోకి ఇంకా లోపలికి తీసుకెళ్లారు. 

ALSO READ | ధర్మస్థలలో పోలీసుల నిర్లక్ష్యం: 15 ఏళ్ల రికార్డులు మాయం, అస్థిపంజరాల మిస్టరీ ఎలా బయటపడుతుంది ?

ఫిర్యాదుదారుడు సాక్షి చూపించిన అన్ని చోట్లలో ఆరో చోట మాత్రమే ఒక మగ అస్థిపంజరం దొరికింది. మిగతా తొమ్మిది చోట్ల ఎలాంటి మానవ అవశేషాల అధరాలు దొరకలేదు. కానీ సోమవారం జరిగిన గాలింపులో దాదాపు 20 మంది పాల్గొన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ధర్మస్థల గ్రామంలో జరిగిన హత్య గురించి ఫిర్యాదు చేసిన జయంత్ టిని ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో  కంప్లైంట్ చేయమనీ సిట్ అధికారులు కోరారు.

జయంత్ టి మాట్లాడుతూ నేను దేశ చట్టాన్ని గౌరవిస్తాను. 15 ఏళ్ల క్రితం పాతిపెట్టిన శవాన్ని చూసిన నలుగురైదుగురు ఉన్నారు. వారు కేసు  దర్యాప్తు సమయంలో సాక్షులుగా వస్తారు, తన ఫిర్యాదులో కావాలని ఎవరినీ లేదా గుడిని టార్గెట్  చేయడం లేదని, ఓ అధికారి తప్పు చేశారని, చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు.