ధర్మస్థలలో పోలీసుల నిర్లక్ష్యం: 15 ఏళ్ల రికార్డులు మాయం, అస్థిపంజరాల మిస్టరీ ఎలా బయటపడుతుంది ?

ధర్మస్థలలో పోలీసుల నిర్లక్ష్యం: 15 ఏళ్ల రికార్డులు మాయం, అస్థిపంజరాల మిస్టరీ ఎలా బయటపడుతుంది ?

కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో మృతదేహాల పూడ్చివేత కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేసింది. దింతో సైట్ నంబర్ 6 నుండి మానవ అస్థిపంజరాలు బయటపడటంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. 

ఈ కేసుకి సంబంధించి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి పోలీసులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా రిజిస్టర్ కాని మరణాల రికార్డులను పోలీసులు ధ్వంసం చేసినట్లు వెల్లడైంది. ధర్మస్థలంలో పెద్ద సంఖ్యలో మహిళలు, మైనర్ల మృతదేహాలను పూడ్చిపెట్టడం చేశారని ఆరోపణలు వచ్చిన కారణంగా సిట్ ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.

నిజానికి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 174 (A) కింద గత 15 ఏళ్లలో  వివరాలు లేని అసాధారణ మరణాలపై సమాచారం కోసం RTI దాఖలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. 2000 నుండి 2015 మధ్య నమోదైన రికార్డులను నాశనం చేసినట్లు పోలీసులు అంగీకరించారు. మృతదేహాలను గుర్తించడానికి ఉపయోగించే పోస్టర్లు, నోటీసులు, పోస్ట్‌మార్టం రిపోర్టులు కూడా లేవని పోలీసులు తెలిపారు. రూల్స్, పరిపాలనా విధానం ప్రకారం వాటిని నాశనం చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన రికార్డులను నాశనం చేసే చట్టపరమైన లేదా నైతిక హక్కు పోలీసులకు లేదు కాబట్టి పోలీసులు ఇచ్చిన సమాధానం పై  న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థలు ఆశ్చర్యపోతున్నాయి. అత్యధిక డిజిటలైజేషన్ ఉన్న దక్షిణ కన్నడ వంటి జిల్లాలో ఈ కిలకమైన డాకుమెంట్స్ లేదా పేపర్స్ డిజిటలైజ్ చేయకపోవడం కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.