Tesla: ముంబైలో టెస్లా తొలి సూపర్ ఛార్జింగ్ స్టేషన్.. ఫుల్ ఛార్జ్‌కి ఎంత ఖర్చవుతుందంటే..?

Tesla: ముంబైలో టెస్లా తొలి సూపర్ ఛార్జింగ్ స్టేషన్.. ఫుల్ ఛార్జ్‌కి ఎంత ఖర్చవుతుందంటే..?

Tesla Superchargers: అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు గత నెలలో భారత మార్కెట్లలోకి ఉడుగుపెట్టింది. ముంబైలో తన తొలి షోరూం కూడా ఓపెన్ చేసింది. ఈ క్రమంలో మెుదటగా టెస్లా తన మోడల్ వై కార్లను ఇండియన్ మార్కెట్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

షోరూం ప్రారంభించిన వారాల వ్యవధిలోనే టెస్లా తన సూపర్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ముంబైలో ప్రారంభించింది. బంద్రా కుర్లా కాప్లెక్స్ ఏరియాలో దీనిని తెరవగా.. రానున్న కొద్ది వారాల్లో ముంబైలోని లోవర్ పరేల్, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు డీసీ సూపర్ ఛార్జింగ్ స్టాల్స్, అలాగే నాలుగు డెస్టినేషన్ ఏసీ ఛార్జింగ్ స్టాల్స్ ఓపెన్ చేసింది. 

ALSO READ : మారుతీ సుజుకీ SUV కార్లలో కొత్త మార్పు.. ఇకపై CNG ట్యాంక్స్ ఎక్కడ పెడతారంటే..?

ఫుల్ ఛార్జ్ చేయటానికి కాస్ట్..
మోడల్ వై కార్ బ్యాటరీ పవర్ 250కిలోవాట్లు. సూపర్ ఛార్జర్ ద్వారా దీనిని ఛార్జ్ చేయటానికి కిలోవాట్ కు రూ.24 చొప్పున అంటే మెుత్తం రూ.1500 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో వాల్ ఛార్జర్ ద్వారా కిలోవాట్ కి రూ.14 చొప్పున ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై చాలా ఆటోలవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సూపర్ ఛార్జర్ ద్వారా టెస్లా మోడల్ వై కార్లను కేవలం 20 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జింగ్ చేయవచ్చు. అలాగే కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్ల మైలేజీని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక సాధారణ ఏసీ ఛార్జర్ల ద్వారా మోడల్ వై బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.