గోల్కొండ 12.30కి.. పల్నాడు 2.40కి

గోల్కొండ 12.30కి.. పల్నాడు 2.40కి
  • పలు రైళ్ల వేళల్లో మార్పులు   
  • జులై 1 నుంచి అమల్లోకి

హైదరాబాద్‌‌, వెలుగు: గోల్కొండ, పల్నాడు, ధనపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ సహా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం తెలిపింది. సికింద్రాబాద్‌‌లో గోల్కొండ ఎక్స్‌‌ప్రెస్ 12.30 గంటలకు, వికారాబాద్‌‌లో పల్నాడు ఎక్స్‌‌ప్రెస్‌‌ 2.40కు, దేవగిరి ఎక్స్‌‌ప్రెస్‌‌ 1.25 గంటలకు మొదలవుతాయని చెప్పింది. సిర్పూర్‌‌లో 2.45కు సిర్పూర్‌‌ కాగజ్‌‌నగర్‌‌–-సికింద్రాబాద్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌, సికింద్రాబాద్‌‌లో రాత్రి 9.35కు సికింద్రాబాద్‌‌–ధనపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌, రాత్రి10.15కు సికింద్రాబాద్‌‌–-నాగ్‌‌పూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌, రాత్రి10.15కు సికింద్రాబాద్‌‌–-దర్భంగ స్టార్టవుతాయంది. అలాగే సికింద్రాబాద్‌‌లో సికింద్రాబాద్‌‌–రాజ్‌‌కోట్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ 3.15కు, సికింద్రాబాద్‌‌-–పోర్‌‌బందర్‌‌ 3.15కు, సికింద్రాబాద్‌‌–జైపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ 10.00కు, హైదరబాద్‌‌లో హుస్సేన్‌‌సాగర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ 2.50కు, హైదరాబాద్‌‌–రేక్సల్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ రాత్రి 9.40 గంటలకు మొదలవుతాయని చెప్పింది. కాజీపేటలో తడోబా ఎక్స్‌‌ప్రెస్‌‌ సాయంత్రం 5.35 గంటలకు, కరీంనగర్‌‌లో కరీంనగర్‌‌ ఎల్టీటీ–ముంబై ఎక్స్‌‌ప్రెస్‌‌ సాయంత్రం 6.50 గంటలకు, లింగంపల్లిలో కాకినాడ–లింగంపల్లి ఎక్స్‌‌ప్రెస్‌‌ రాత్రి 7.55 గంటలకు ప్రారంభమవుతాయంది. మార్చిన వేళలు జులై ఒకటి నుంచి అమలవుతాయని చెప్పింది.