రానున్న మూడు రోజులు వర్షాలు దంచుడే

రానున్న మూడు రోజులు వర్షాలు దంచుడే

హైదరాబాద్‌: రాష్టంలో పలుచోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేశారు.  ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని మంగళవారం వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం దగ్గర ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో పలుచోట్ల ఈ మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిపారు.