రెయిన్ ఎఫెక్ట్.. ఆగిపోయిన పుష్ప 2 షూటింగ్

రెయిన్ ఎఫెక్ట్.. ఆగిపోయిన పుష్ప 2 షూటింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)..పుష్ప2 ది రూల్ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు ఆ అంచనాలను మించి ఉండేలా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)  పుష్ప 2 కోసం.. భారీ ట్విస్టులతో కూడిన కంటెంట్ ను రెడీ చేసినట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ పలు కారణాల వలన తరుచు పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది.

తాజా సమాచారం ప్రకారం చిత్రీకరణ దాదాపు పూర్తి అయినప్పటికీ కొన్ని ప్యాచ్ వర్క్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం జూలై 19న తిరిగి స్టార్ట్ అవ్వాల్సిన షూటింగ్.. కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ పుష్ప 2 మూవీ విషయంలో డీలా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కు ఎదురవుతున్నా అడ్డంకులను తట్టుకుని సినిమా రిసల్ట్ విషయంలో మాత్రం డిస్సపాయింట్ అవ్వరని యూనిట్ సభ్యుల నుండి టాక్ వినిపిస్తోంది. ఔట్ డోర్ షూటింగ్ ఎక్కువగా ఉన్న మూవీ కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కామన్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదిగిన పుష్ప రాజ్ ను ధీ కొట్టడం కోసం భన్వర్ సింగ్ షెకావత్ ఎంతకైనా తెగించే పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ కోసం మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేసినట్లుగా టాక్. అలాగే పుష్ప 2 ది రూల్ లో  కీలకపాత్రలతో పాటు.. కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది..

దీంతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప పార్ట్ 1 లో బ‌న్నీ స్టైల్‌, మేన‌రిజ‌మ్, సాంగ్స్‌, డాన్సులు అన్నీ తెగ పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియెన్స్ అంద‌రూ పుష్ప 2 ది రూల్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.