మూడు రోజులు మోస్తరు వానలు

మూడు రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్‌, వెలుగు: రానున్న మూడురోజులు రాష్ట్రం లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షా లు కురిశాయి. కరీంనగర్‌ జిల్లా ఖాసీంపేటలో 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌ జిల్లా నాగపూర్ లో 58.8, వాడిలో 54, సంగారెడ్డి జిల్లా కంగ్టి లో 49, కామారెడ్డిలోని తాడ్వాయిలో 45.8, నిజామాబాద్‌లోని చిన్నమావందిలో 45.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌, జగిత్యా ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగి, రాజన్న సిరిసి ల్ల, నాగర్ కర్నూల్‌, భద్రాద్రి కొత్త గూడెం, కొమ్రుం భీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, మేడ్చల్‌, వికారాబా ద్‌ జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో వాన పడింది. నల్గొండలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది