సిటీలో చిరుజల్లులు

సిటీలో చిరుజల్లులు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత చిరుజల్లులు పడ్డాయి. షేక్​పేట, చర్లపల్లి, కాప్రా, ఉప్పల్ ఏరియాల్లో సెం.మీ చొప్పున వర్షం కురిసింది. మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.