భాగ్యనగరంలో భారీ వర్షం

భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, కమ్మర్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మీర్ పేటలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి నగరమంతా మేఘావృతమైంది. మేఘాలతో అక్కడక్కడా పగటిపూటనే చీకట్లు కమ్ముకున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. ఓయూ, తార్నాక, ఉప్పల్, మేడిపల్లిలో వర్షం కురుస్తోంది.

మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చంపాపేట, సంతోష్ నగర్, చాదర్ ఘాట్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ భారీగా కురుస్తున్న వర్షాలతో జనం సతమతమౌతున్నారు. అటు  జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, రామచంద్రాపురం, BHEL ఏరియాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఓవైపు వర్షం పడుతుండటం.. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో జనం ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చిన ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నాయి. పలుచోట్ల వాటర్ లాగింగ్ లతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇవాళ సద్దల బతుకమ్మకు వాన గండం తప్పేలాలేదు.