హైదరాబాద్లో వర్షం.. మరో రెండు మూడు గంటలు దంచుడే దంచుడు.. ఈ ఏరియాలకు హై అలర్ట్

హైదరాబాద్లో వర్షం.. మరో రెండు మూడు గంటలు దంచుడే దంచుడు.. ఈ ఏరియాలకు హై అలర్ట్

ఒకవైపు హైదరాబాద్ నగరం బతుకమ్మ సంబరాల కోసం ముస్తాబు అయితే.. మరోవైపు వాతావరణం ఎప్పుడు వర్షం కురుస్తుందా అన్నట్లుగా తయారైంది. ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి చాలా చోట్ల వేడుకలకు అంతరాయం అయ్యింది. కొన్ని చోట్ల వర్షంలోనూ బతుకమ్మ నిర్వహించారు మహిళలు. 

ఇవాళ (సోమవారం 22) కూడా హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఆందోళన కరంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్.. 3.30 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది.  నగరవ్యాప్తంగా అక్కడక్కడా క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం కురిసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. 

క్యూమిలో నింబస్ మేఘాలతో నగరంలో వర్షం మొదలైంది .  పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు  కురుస్తున్నాయి. దీంతో మరో రెండు మూడు గంటల పాటు నగరంలో వర్షం కి ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.  వర్షాలకు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ మాన్సూన్, హైడ్రా drf, ట్రాఫిక్ సిబ్బందిని  అప్రమత్తం చేసిన వాతావరణ కేంద్రం. 

ఈ ఏరియాల్లో వర్షం మొదలైంది.:

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షం స్టార్టయ్యింది. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అటు కుత్బుల్లాపూర్, సుచిత్ర లో జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా, శామీర్ పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో వాహనదారులు షాపులు, షట్టర్ల ముందు సేదతీరుతున్నారు. 

 బషీర్ బాగ్ , అబిడ్స్ , ట్యాంక్ బండ్ , హిమాయత్ నగర్ , కోఠి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో వానకు రోడ్లపైన భారీగా వరద నీరు చేరుకుంది. 

ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ , ఎర్రగడ్డ, బోరబండ, మోతి నగర్, సనత్ నగర్ ఏరియాల్లో వాన దంచికొడుతోంది. రోడ్డుపై ముందున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. వాననీటితో రోడ్లన్నీ చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయి.