
హైదరాబాద్ లో శుక్రవారం పలుచోట్ల వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం చల్లబడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయ నుంచి ఎండ బాగానే ఉన్నప్పటికీ, మధ్యాహ్నం సమయానికి కాస్త వాతావరణం మారిపోయింది. ఉప్పల్, ఎల్బీ నగర్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల పంట నష్టం జరిగినట్లు తెలిస్తుంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.