రాష్ట్రంలో 24 గంటల పాటు వర్షసూచన

రాష్ట్రంలో 24 గంటల పాటు వర్షసూచన

హైదరాబాద్ లో ఈ సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎండలు దంచికొట్టినా… సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత గంట సేపు వాన పడింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన నాలుగు రోజులుగా టెంపరేచర్స్ తక్కువగా రికార్డయ్యాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

పశ్చిమ విదర్భ నుంచి కోస్తా, కర్ణాటక వరకు… మరఠ్వాడా , మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం కురుస్తుందని వివరించింది.