హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం

మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనానికి కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ల‌క్డీకాపూల్, నాంప‌ల్లి, కోఠి, అత్తాపూర్, సోమాజిగూడ‌, బేగంపేట‌, ఇబ్రహీంపట్నం, హ‌య‌త్‌న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేటలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.